IPL 2024 : ఆర్సీబీ ఓటమి... మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు

IPL 2024 : ఆర్సీబీ ఓటమి... మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు

ఈ సీజన్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు నాలుగు సార్లు సున్నాకే వెనుదిరిగారు. ఈ సీజన్లో 9 ఇన్నింగ్సుల్లో 5.77 సగటుతో 59 పరుగులు చేశారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్‌గా కార్తీక్(18) రికార్డును మ్యాక్సీ సమం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(17), పియూష్ చావ్లా(17), నరైన్(16) ఉన్నారు.

అంతర్జాతీయ మ్యాచుల్లో అదరగొట్టే మ్యాక్స్‌వెల్..ఐపీఎల్ లో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నారని ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈ విమర్శలకు అతడి గణాంకాలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. గత 9 అంతర్జాతీయ టీ20ల్లో 60.50 సగటు, 192 SRతో 363 రన్స్ చేసిన ఈ ఆసీస్ ప్లేయర్.. ఆర్సీబీ తరఫున 9 మ్యాచుల్లో 5.77 సగటుతో 52 రన్స్ మాత్రమే చేశారు. మరి రాబోయే టీ20 WCలో మ్యాక్సీ ఎలా ఆడతారో చూడాలి.

మరోవైపు లీగ్ స్టేజీలో వరుసగా 6 మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ.. కీలక పోరులో నిరాశపరిచింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. తొలుత ఆర్సీబీ 172/8 రన్స్ చేయగా.. RR 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలిచిన శాంసన్ సేన.. 24న SRHతో తలపడనుంది. అందులో గెలిచిన జట్టు 26న ఫైనల్‌లో KKRతో అమీతుమీ తేల్చుకోనుంది.

Tags

Next Story