Mitchell Starc : ఒక్కడికి రూ.24.75 కోట్లు ఖర్చు పెట్టింది ఇందుకే

Mitchell Starc : ఒక్కడికి రూ.24.75 కోట్లు ఖర్చు పెట్టింది ఇందుకే
X

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారిన స్టార్క్ తొలి 9 మ్యాచుల్లో 7 వికెట్లే తీశారు. ఇతడి కోసం రూ.24.75 కోట్లు ఖర్చు చేయడమా అని సెటైర్లు వేశారు. కానీ కీలక మ్యాచుల్లో తానెంత విలువైన ఆటగాడో చాటి చెప్పారు స్టార్క్. క్వాలిఫయర్-1లో సన్ రైజర్స్ ను 3 వికెట్లతో దెబ్బకొట్టిన అతడు.. ఫైనల్ లో అభిషేక్, త్రిపాఠిలను ఔట్ చేశారు. క్వాలిఫయర్-1, ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్‌గా సునీల్ నరైన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు మూడు సీజన్లలో అతను ఈ ఘనత సాధించారు. 2012లో 24 వికెట్లు, 2018లో 357 రన్స్, 17 వికెట్లు, 2024లో 488 రన్స్, 17 వికెట్లతో రాణించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచారు. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

కేకేఆర్ ఖాతాలో మూడో ఐపీఎల్ ట్రోఫీ చేరింది. 2012, 2014లో గంభీర్ సారథ్యంలో టైటిల్ గెలుచుకున్న ఈ జట్టు, తాజాగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గంభీర్ మెంటార్‌షిప్‌లో కప్పు నెగ్గింది. ఈ మెగా టోర్నీలో MI(5), సీఎస్కే(5) తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్(3) నిలిచింది.

Tags

Next Story