Rishabh Pant : రికార్డు సృష్టించిన రిషభ్ పంత్

ఐపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో (2028) మూడు వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రిషభ్ పంత్ రికార్డు సృష్టించారు. అతని తర్వాతి స్థానాల్లో యూసుఫ్ పఠాన్(2062), సూర్యకుమార్ యాదవ్(2130), రైనా(2135) ఉన్నారు. అంతేకాకుండా అతి పిన్న వయసులో 3వేల రన్స్ చేసిన ప్లేయర్లలో పంత్ మూడో స్థానంలో నిలిచారు. అతనికంటే (26y, 191d) ముందు గిల్ (24y, 215d), కోహ్లీ(26y, 186d) ఈ ఫీట్‌ను సాధించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐపీఎల్‌లో మరో రికార్డు సృష్టించారు. కనీసం 3,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్ కలిగిన మూడో బ్యాటర్‌గా పంత్ (148.6) రికార్డులకెక్కారు. అగ్రస్థానంలో ఏబీ డివిలియర్స్ (151.68), రెండో స్థానంలో క్రిస్ గేల్ (148.96) ఉన్నారు. కాగా పంత్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి 194 పరుగులు చేశారు. అందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఇదిలాఉంటే.. 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదం తర్వాత దాదాపు 15 నెలల పాటు క్రికెట్‌కు దూరమైన రిషభ్ పంత్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో పునరాగమనం చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడి రెండు అర్థ శతకాల సాయంతో 194 పరుగులు చేశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 104 మ్యాచులు ఆగిన పంత్ 3032 పరుగులు చేశాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com