Rishabh Pant : రిషభ్ పంత్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డ్.. రవిశాస్త్రి భావోద్వేగం

టీ20 ప్రపంచ కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. స్వల్ప లక్ష్యం ఉంచినా పాక్ ను కట్టడి చేసి టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రమాణాలను పాటించిన ఆటగాడికి భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ( Ravi Shastri ) 'బెస్ట్ ఫీల్డర్' మెడల్ అందించాడు.
పంత్, సూర్య కుమార్ యాదవ్, అర్షదీప్ సింగ్ ఈ మెడల్ కోసం పోటీ పడ్డారు. బ్యాటింగ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రిషభ్ పంత్ ( Rishabh Pant ).. ఫీల్డింగ్ లోనూ మూడు క్యాచ్ లు పట్టాడు. కీపర్ గా స్టంప్స్ వెనుక చురుగ్గా ఉన్నాడు. దీంతో పంత్ కు ఈ మెడల్ వరించింది. రిషభ్ కు మెడల్ ను అందజేస్తూ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాట్లాడేముందు పంత్ ను హగ్ చేసుకుంటా.. అతడిని వరల్డ్ కప్ లో చూడటం చాలా బాగుందన్నాడు. పంత్ అద్భుతంగా ఆడుతున్నాడనీ.. రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చాయని గుర్తుచేసుకున్నాడు.
ఆ పరిస్థి తుల్లో అతడిని ఆసుపత్రిలో చూస్తాననుకోలేదనీ.. కోలుకుని వచ్చి.. ఇలాంటి భారీ మ్యాచ్ లో సత్తా చాటడం ప్రశంసనీయమన్నాడు రవిశాస్త్రి. ఆపరేషన్ తర్వాత మైదానంలోకి దిగి చురుగ్గా కదలడం నిజంగా అద్భుతమేననీ.. మృత్యువు అంచుల్లోకి వెళ్లి వచ్చిన పంత్.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com