Rohit Sharma : కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరో ఘనత
ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ ( Rohit Sharma ) రెండో స్థానానికి చేరారు. ధోనీ 58 మ్యాచ్‌లలో 41 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నారు. హిట్ మ్యాన్ 20 మ్యాచ్‌లలో 17 గెలుపులు, గంగూలీ 22 మ్యాచ్‌లలో 16 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ సారథ్యంలో WTC ఫైనల్, ODI WC ఫైనల్, T20WC సెమీ ఫైనల్‌లో భారత్ ఓడింది. ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ లో బ్యాటర్లను నస పెడుతున్న నసావు స్టేడియంలో భారత్ రికార్డు సృష్టించింది. అక్కడ అత్యధిక రన్ ఛేజ్(111/3vsUSA) చేసిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాత పాక్(107/3vsకెనడా), సౌతాఫ్రికా(106/6vsనెదర్లాండ్స్) ఉన్నాయి. అలాగే ఆ మైదానంలో హ్యాట్రిక్ విజయాలు(vsఐర్లాండ్, పాక్, US) సొంతం చేసుకున్న రెండో జట్టుగా(తొలి టీమ్ ప్రోటీస్) రోహిత్ సేన నిలిచింది. ఈ గ్రౌండులో కెనడా చేసిన 137 స్కోరే(vsఐర్లాండ్) అత్యధికం.
టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత మెరుగైన గణాంకాలు నమోదు చేసిన భారత ప్లేయర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచారు. ఇవాళ USAతో మ్యాచులో 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీశారు. ఆ తర్వాతి స్థానాల్లో అశ్విన్(4/11-AUS), హర్భజన్ సింగ్ (4/12-ENG), ఆర్పీ సింగ్(4/13-SA), జహీర్ ఖాన్(4/19-IRE) ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com