IPL 2024 : రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో ఘనత

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో ఘనత సాధించారు. 6,500కుపైగా పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. అంతకుముందు విరాట్ కోహ్లీ (7,624), శిఖర్ ధవన్ (6,768), డేవిడ్ వార్నర్ (6,563)ఈ ఫీట్ నమోదు చేశారు.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 9 రన్స్ తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు కట్టడి చేశారు. శశాంక్ 41(25), అశుతోశ్ 61(27) శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో పంజాబ్ 183 రన్స్‌కే పరిమితమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా, గెరాల్డ్ చెరో 3 వికెట్లతో రాణించారు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కి ఇది మూడో విజయం కాగా, పంజాబ్ కింగ్స్‌కు ఐదో ఓటమి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com