Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత

Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత
X

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో, టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ఇంతవరకూ రోహిత్ తప్ప మరే బ్యాటర్ అఫ్రీది వేసిన తొలి ఓవర్లో సిక్సర్ కొట్టలేదు. కాగా అంతర్జాతీయ మ్యాచుల్లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఐపీఎల్ లో ముంబై కెప్టెన్సీ మార్పుతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అభిమానులను హత్తుకుంటోంది. పాక్ పై తీవ్ర ఉత్కంఠగా మ్యాచ్ సాగుతుండగా పాండ్య షాదాబ్ ఖాన్ వికెట్ తీశారు. దీంతో కెప్టెన్ రోహిత్.. పాండ్యను ఎత్తుకుని అభినందించారు. నిన్న బ్యాటింగ్‌లో విఫలమైన ఈ ఆల్‌రౌండర్ రెండు కీలక వికెట్లు తీసి, గెలుపులో కీలకపాత్ర పోషించారు.

టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై 6 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ లో ఒకే జట్టు(పాక్)పై అత్యధికసార్లు(7) గెలిచిన జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్‌పై పాక్, విండీస్‌పై శ్రీలంక చెరో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్‌లోనూ పాక్‌ను భారత్ ఎనిమిది సార్లు ఓడించింది.

Tags

Next Story