Ind vs Eng : ఐదో టెస్టు .. రోహిత్ శర్మ, గిల్‌ సెంచరీలు

Ind vs Eng : ఐదో టెస్టు ..  రోహిత్ శర్మ, గిల్‌ సెంచరీలు
X

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో సెంచరీలు కంప్లీట్ చేశారు. రోహిత్ కు టెస్టుల్లో 12వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీలో 13 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. బౌండరీల ద్వారానే 70 పరుగులు రాబట్టాడు రోహిత్.. ఇక టెస్టుల్లో శుభ్‌మన్‌ గిల్‌ కిది నాలుగో సెంచరీ. 10 ఫోర్లు, 5 సిక్సర్ల సహయంతో 137 బంతుల్లో 100 పరుగుల మార్క్‌ చేరుకున్నాడు గిల్. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి ఇప్పటికే 153 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి టీమిండియా స్కోర్ 262 పరుగులుగా ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 218 పరుగులకు ఆలౌటైంది.

Tags

Next Story