Cricket : రోహిత్ ఖాతాలో రెండు రికార్డులు

Cricket : రోహిత్ ఖాతాలో రెండు రికార్డులు

రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఇప్పటికే ఓ ప్రపంచరికార్డు (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్లు అందుకున్న తొలి ప్లేయర్) నెలకొల్పిన హిట్ మ్యాన్... తాజాగా బ్యాటింగ్ లో మరో రికార్డు సాధిం చాడు. చివరి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మమ అరుదై న రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ బౌలింగ్ మార్క్ వుడ్ క్యాచ్ ను రోహిత్ అందుక ఎన్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో 60 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్ లు పట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ ఏ ఆటగాడూ ఈ ఫీట్ సాధించలేదు. తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్ లో సిక్సర్ బాదిన రోహిత్ శర్మ... వరల్డ్ టెస్ట్ చాంపియన్షి ప్ లో 50 సిక్సర్ల మార్కును అందుకు న్నాడు.

తద్వారా డబ్ల్యూటీసీ చరిత్ర లో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్ గా... ఓవరాల్గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్ల్యూటీసీ హిస్టరీలో అత్య ధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ డబ్ల్యూ టీసీలో 45 మ్యాచ్ ల్లో 78 సిక్సర్లు కొట్టాడు. స్టోక్స్ తర్వాత అత్యధి కంగా హిట్ మ్యాన్ 32 ఇన్నింగ్స్ ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో స్టోక్స్, రోహిత్ తర్వాత రిషబ్ పంత్ (38), జానీ బెయిర్ (29), జైస్వాల్ (26) ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story