Rohit Sharma : హిట్‌మ్యాన్ ఖాతాలో చెత్త రికార్డు
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) చెత్త రికార్డు నెలకొల్పారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమైన భారత బ్యాటర్‌గా రోహిత్ (11) నిలిచారు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆయన 8 పరుగులే చేశారు. హిట్‌మ్యాన్ తర్వాత యువరాజ్ సింగ్ (8), సురేశ్ రైనా (7), గౌతమ్ గంభీర్ (5), విరాట్ కోహ్లీ (5), కేఎల్ రాహుల్ (5) ఉన్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచారు. అఫ్గాన్‌తో నిన్నటి మ్యాచులో ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేయగా, కింగ్ 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్‌గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్(4,145) తొలి స్థానంలో ఉన్నారు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్-8లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఛేదనలో అఫ్గాన్ 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అర్ష్‌దీప్ తలో 3 వికెట్లు తీశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com