IPL 2024 : రోహిత్ శర్మ చెత్త రికార్డు

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అత్యధికసార్లు(8) ఒకే బౌలర్(సునీల్ నరైన్)కు వికెట్ సమర్పించుకున్న ప్లేయర్‌గా నిలిచారు. ఏడుసార్ల చొప్పున ధోనీ(vsజహీర్ ఖాన్), కోహ్లీ(vsసందీప్ శర్మ), అంబటి రాయుడు(vsమోహిత్), రోహిత్(vsఅమిత్ మిశ్రా), ఉతప్ప(vsఅశ్విన్), పంత్(vsబుమ్రా), రహానే(vsభువనేశ్వర్) ఔటయ్యారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఓటమి పాలైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సూర్యకుమార్(56) మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 145 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో స్టార్క్ 4, వరుణ్, నరైన్, రసెల్ తలో 2 వికెట్లు తీశారు. ఈ పరాజయంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.
ముంబై, కోల్‌కతా మధ్య మ్యాచులో చెత్త ఫీట్ చోటు చేసుకుంది. ఒకే మ్యాచులో ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. దీంతో ఈ సీజన్‌లో ఓకే మ్యాచులో రెండు టీమ్స్ ఆలౌటైన తొలి మ్యాచుగా నిలిచింది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇలా నాలుగు సార్లు జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com