RCB Worst Record : ఐపీఎల్‌ హిస్టరీలో ఆర్సీబీ చెత్త రికార్డు

RCB Worst Record : ఐపీఎల్‌ హిస్టరీలో ఆర్సీబీ చెత్త రికార్డు
X

ఐపీఎల్‌ ట్రోఫీని అందుకోవాలనే బెంగళూరు కల మరోసారి కల్లలయ్యింది. నిన్న రాజస్తాన్‌‌ రాయల్స్ చేతిలో ఓటమితో టోర్నీ ప్లేఆఫ్స్‌లో అత్యధికసార్లు(16 మ్యాచ్‌లలో 10 సార్లు) వెనుదిరిగిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (26M.. 9 ఓటములు), ఢిల్లీ (11M.. 9 పరాజయాలు), ముంబై (20M.. 7 ఓటములు), సన్ రైజర్స్ (12M.. 7 పరాజయాలు) ఉన్నాయి. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలవని విషయం తెలిసిందే.

మరోవైపు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయామని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. మరో 20 పరుగులు చేసి ఉంటే టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకునే ఛాన్స్ ఉండేదన్నారు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తమకు పెద్ద ఉపయోగపడలేదని చెప్పారు. పాయింట్ల పట్టికలలో అట్టడుగు స్థానం నుంచి ఎలిమేటర్ మ్యాచ్‌ వరకు రావడం గర్వంగా ఉందన్నారు. కాగా ఆర్సీబీ విధించిన 172 పరుగులు లక్ష్యాన్ని రాజస్థాన్‌19 ఓవర్లలోనే చేధించింది.

Tags

Next Story