IPL 2024 : కోహ్లీని దాటేసిన గైక్వాడ్.. అరుదైన ఘనత

ఐపీఎల్-2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(509) కొనసాగుతున్నారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో 62 రన్స్‌తో రాణించి ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న కోహ్లీని (500) అధిగమించారు. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా సాయి సుదర్శన్ 418, కేఎల్ రాహుల్ 406, పంత్ 398, సాల్ట్ 392, శాంసన్ 385, నరైన్ 372 ఉన్నారు.
రుతురాజ్ గైక్వాడ్ మరో అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్‌లో ఓ సీజన్‌లో 500 పరుగులు చేసిన తొలి CSK కెప్టెన్‌గా నిలిచారు. గైక్వాడ్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 509 పరుగులు చేశారు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ధోనీ నుంచి కెప్టెన్‌గా రుతురాజ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఇక చెన్నైతో జరిగిన మ్యాచులో పంజాబ్ అలవోకగా విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 13 బంతులు మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్ స్టో(46), రోస్సో(43) రాణించారు. సామ్ కరన్(26*), శశాంక్(25*) జట్టును విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో శార్దూల్, రిచర్డ్, దూబే తలో వికెట్ తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com