Sania Mirza : మరో పెళ్లికి సానియామీర్జా రెడీ..! ఆ స్టార్ ఎవరంటే..?

Sania Mirza : మరో పెళ్లికి సానియామీర్జా రెడీ..! ఆ స్టార్ ఎవరంటే..?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా .. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ ను గతంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని కారణాల చేత ఆయనకు విడాకులు ఇచ్చేసింది. అప్పటికే ఆమెకి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అయినా కూడా సరే ఆమె మనస్పర్ధలు కారణంగా అతడికి విడాకులు ఇచ్చేసింది. ఈ న్యూస్ అప్పట్లో హాట్ హాట్ గా ట్రెండ్ అయింది.

సానియా మీర్జా రెండో పెళ్లిపై పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి. 'విడాకులు తీసుకుంటే లైఫ్ జర్నీ ఆగిపోయినట్లు కాదు విడాకులు తీసుకోవడం దురదృష్టకరం కాదు.. ఎవరి లైఫ్ వారిది ..ఎవరి జీవితం చీకటిమయం కాకూడదు .. సానియా నీకు మంచి పార్ట్ నర్ దొరికితే పెళ్లి చేసుకో నువ్వు తప్పకుండా రెండు పెళ్లి చేసుకో.. నీకు మంచి లైఫ్ ఉంటుంది.. సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవడం ఏం తప్పు కాదు.. ఎలాగో షోయబ్ రెండో పెళ్లి చేసుకున్నాడు.." అంటూ నబీల్ జాఫర్ అన్నాడు.

ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సానియా మీర్జా ఒక స్టార్ తో ప్రేమాయణం నడుపుతోందని.. త్వరలోనే ఆయనను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. చూడాలి.. ఈ కథ ఏ మలుపు తీసుకుంటుందో!

Tags

Next Story