Sanjana Ganesan : బుమ్రా భార్య పేరుతో ఫేక్ అకౌంట్.. వార్నింగ్ ఇచ్చిన సంజన

Sanjana Ganesan : బుమ్రా భార్య పేరుతో ఫేక్ అకౌంట్.. వార్నింగ్ ఇచ్చిన సంజన

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) భార్య సంజనా గణేశన్ ( Sanjana Ganesan ) పేరుతో Xలో ఓ ఫేక్ అకౌంట్ సృష్టించారు. తన పేరుతో నకిలీ ఖాతా క్రియేట్ చేయడంతో సంజన మండిపడ్డారు. ‘నా కుటుంబం ఫొటోలు, సమాచారాన్ని ఎవరో దొంగిలించి అచ్చం నా అకౌంట్ లాగే మరో ఖాతా తెరిచారు. వెంటనే దీనిని తొలగించండి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె హెచ్చరించారు.

సంజనా గణేశన్ ICC ప్రెజెంటర్. T20 వరల్డ్ కప్ 2024 కోసం సంజన అమెరికా, వెస్టిండీస్‌కు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ గెలిచిన తర్వాత ఆమె భర్త బుమ్రాతో కలిసి వేడుకలు జరుపుకుంది. ఆ సమయంలో వారి కొడుకు కూడా వెంట ఉన్నాడు. విజయోత్సవ వేడుకల ఫోటోల‌ను ఆమె పేరుతో ఉన్న నకిలీ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై సంజన చర్యలు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించింది.

Tags

Next Story