Sanjay Manjrekar : విఫలమవుతున్నా సంజూకి ఛాన్సులివ్వాలి: మంజ్రేకర్

సంజూ శాంసన్ వరసగా విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి ఎక్కువ అవకాశాలిస్తూ ఉండాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో పరుగులెన్ని చేశారని కాకుండా ఆటగాడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడో అంచనా వేయాలి. సంజూ వంటి బ్యాటర్ క్రీజులో ఉంటే మ్యాచ్ గతినే మార్చేయగలరు. ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలరు. ఒక్కోసారి వైఫల్యాలు వస్తాయి. అయినప్పటికీ ఓపిగ్గా ఛాన్సులిచ్చి అండగా నిలవాలి’ అని పేర్కొన్నారు.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత ప్లేయర్ సంజూ శాంసన్ పేలవ ప్రదర్శన చేశారు. ఆడిన 5 మ్యాచుల్లో 7 సగటుతో 35 పరుగులే చేశారు. ఇవాళ్టి మ్యాచులో సిక్సర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించి ఊపు మీదున్నట్లు కనిపించినా రెండో ఓవర్లోనే పుల్ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దీంతో శాంసన్‌కు ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గైక్వాడ్ వంటి ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com