Sanju Samson : సంజూ శాంసన్ ఖాతాలో మరో రికార్డు

Sanju Samson : సంజూ శాంసన్ ఖాతాలో మరో రికార్డు

రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) రికార్డు సృష్టించారు. రాజస్థాన్ తరఫున అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. సంజూ ఇప్పటివరకు 25 సార్లు 50+ స్కోర్లు చేయగా, అతని తర్వాత స్థానంలో బట్లర్ (24) ఉన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచులాడిన సంజూ 246 రన్స్ చేశారు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న అతడిని టీ20 వరల్డ్ కప్ జట్టుకు సెలెక్ట్ చేయాలని బీసీసీఐ సెలక్టర్లకు పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆఖరి బంతికి టార్గెట్‌ను చేధించింది. ఆ జట్టు బ్యాటర్లలో గిల్ 72, సుదర్శన్ 35 రన్స్‌తో రాణించారు. చివర్లో రాహుల్ తెవాటియా(22), రశీద్ ఖాన్(24*) బౌండరీలు బాది తమ జట్టుకు విజయాన్నందించారు.

Tags

Read MoreRead Less
Next Story