Badminton : జపాన్ ఓపెన్‌లో సాత్విక్- చిరాగ్ ఓటమి

బ్యాడ్మింటన్ లో భారత స్టార్ మెన్స్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టికి జపాన్ ఓపెన్ 200cలో నిరాశ ఎదురైంది. వారు రెండో రౌండ్ లోనే ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ నంబర్ 6 ర్యాంక్ లో ఉన్న సాత్విక్-చిరాగ్ జోడీ, చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్ - వాంగ్ చాంగ్ జోడీ చేతిలో 22-24, 14-21 తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ 44 నిమిషాల పాటు సాగింది. తొలి గేమ్ లో సాత్విక్-చిరాగ్ 18-14 ఆధిక్యంలోకి దూసుకెళ్లినప్పటికీ, ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయారు. చైనీస్ జోడీ పుంజుకుని తొలి గేమ్ ను గెలుచుకుంది. రెండో గేమ్ లోనూ చైనీస్ జోడీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇది చైనీస్ జోడీపై సాత్విక్-చిరాగ్ కు వరుసగా నాలుగో ఓటమి. ఈ ఓటమితో జపాన్ ఓపెన్ లో వారి ప్రయాణం ముగిసింది. అయితే, ఇదే టోర్నమెంట్ లో లక్ష్య సేన్ రెండో రౌండ్ లోకి ప్రవేశించగా, పీవీ సింధు మాత్రం తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com