Mohammed Siraj : హైదరాబాద్ కు సిరాజ్.. జోరు వానలో ఘన స్వాగతం

టీ20 వరల్డ్ కప్ హీరో, భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) తన సొం గడ్డ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. ముంబైలో విక్టరీ పరేడ్, వాంఖడేలో బీసీసీఐ సత్కారం ముగియడంతో శుక్రవారం సాయంత్రం సొంత నగరమైన హైదరాబాద్లో వాలిపోయాడు.
లోకల్ బాయ్ అయిన సిరాజ్ మియాకు స్థానిక అభిమానులు ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో సిరాజ్ దిగగానే అతడిని ఫ్యాన్స్ చుట్టేశారు. వరల్డ్ కప్ విజేతగా తిరిగొచ్చిన సిరాజ్ తో ఫొటోలు దిగేందుకు పోటీ పడిన అభిమానులు.. ఆ తర్వాత సంబురాల్లో మునిగిపోయారు. అంతేకాదు మెహిదీపట్నం నుంచి ఈద్గా గ్రౌండ్లోని సిరాజ్ ఇంటి వరకు భారీగా ర్యాలీ తీశారు. ప్రపంచ కప్ విజేతగా తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన సిరాజ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ స్వాగతం పలికింది.
'సొంత సిటీకి వచ్చిన మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ వెల్కమ్ చెప్తోంది' అని ఆరెంజ్ ఆర్మీ పోస్ట్ పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com