Cricket News : క్రికెట్ కు షాబాజ్ నదీమ్ గుడ్ బై

టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ (Shahbaz Nadeem) అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. వయసు పైబడటంతో పాటు టీమిండియాకు (Team India) ఆడే అవకాశాలు లేకపోవడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపి న నదీమ్.. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగ్ లో పాల్గొనాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
షాబాజ్ నదీమ్ 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున కేవలం రెండు టెస్టు మ్యాచ్లు ఆడిన ఇతను 8 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల నదీమ్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది.
రంజీల్లో జార్ఖండ్ కు ప్రాతినిథ్యం వహించిన షాబాజ్ తమ రాష్ట్రం తరపున రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తిరుగులేని బౌలర్గా నిలిచిన నదీమ్ 140 మ్యాచ్లు ఆడి మొత్తం 542 వికెట్లు పడగొట్టి తన సత్తేంటో నిరూపించుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com