IPL 2024 : ఎవరీ శశాంక్ సింగ్ ... వద్దనుకున్నవాడే మ్యాచ్ గెలిపించాడు

ఐపీఎల్ లో నిన్న గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శశాంక్ సింగ్ (Shashank Singh) దేశవాళీ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2015లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో అరంగేట్రం చేశారు. 2019లో ఛత్తీస్‌గఢ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటెల్స్ (2017), రాజస్థాన్ రాయల్స్ (2018-19), సన్ రైజర్స్ హైదరాబాద్ (2022), పంజాబ్ (2024)కు ఆడారు. ఒక లిస్ట్-A మ్యాచులో 150 రన్స్, 5 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్‌గా గతేడాది రికార్డు సృష్టించారు.
గుజరాత్‌తో మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ను గెలిపించిన శశాంక్‌ని వేలంలో పంజాబ్ వద్దనుకుంది. వేరొక శశాంక్‌ను కొనబోయి.. ఇతడిని రూ.20లక్షలకు కొనేసింది. అప్పట్లో అది చర్చనీయాంశమైంది. కాగా.. సరైన శశాంక్ సింగే జట్టులోకి వచ్చాడు అని అప్పుడు పంజాబ్ యాజమాన్యం కవర్ చేసుకుంది. అయితే.. అలా వద్దనుకున్న ఆటగాడే ఇప్పుడు పెద్ద దిక్కుగా మారి కష్టాల్లో ఉన్న జట్టును 29బంతుల్లో 61రన్స్‌తో రాణించి గెలిపించారు.
ఇక గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో చేధించింది. 111 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో శశాంక్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 29 బంతుల్లోనే 4 సిక్సులు, 6 ఫోర్లతో 61 రన్స్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో ఎండ్‌లో అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 పరుగులతో రాణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com