Shikhar Dhawan : మిథాలీతో నా వివాహమంటూ చాలా రూమర్స్ వచ్చాయి: ధవన్

గతంలో తనపై వచ్చిన రూమర్స్ గురించి క్రికెటర్ శిఖర్ ధవన్ తాజాగా షేర్ చేసుకున్నారు. ‘ఒకానొక టైమ్‌లో నేను మహిళా జట్టు మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు రాశారు. కానీ అవన్నీ ఫేక్. ఇలాంటి ఆరోపణలే నాపై చాలా వచ్చాయి’ అని గబ్బర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా తన కంటే పదేళ్లు పెద్దదైన ఆయేషాను శిఖర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధల కారణంగా విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు.
ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. మనస్పర్థలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్న వీరు తాము విడిపోతున్నట్లు 2021లో ప్రకటించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ.. ధావన్ దిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి.
మరోవైపు, మిథాలీ రాజ్ పెళ్లి చేసుకోకుండా ఒంటిరిగానే జీవిస్తోంది. నిజానికి మిథాలీకి 22 ఏళ్లు వచ్చినప్పటి నుంచే పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు కుటుంబసభ్యులు. అయితే, క్రికెట్‌తో బిజీగా ఉండటం వల్ల ఎన్ని సంబంధాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసింది. చివరకు 27-30 ఏళ్లు వచ్చాక పెళ్లి గురించి ఆలోచన మానేసిందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com