ICC Awards : స్మృతి మంధాన, జస్ప్రీత్ బుమ్రాలకు ఐసీసీ అవార్డులు
జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గెలుచుకున్నారు. ఈ అవార్డు కోసం బుమ్రా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్‌లతో పోటీ పడ్డాడు. వీరిద్దరిని అధిగమించి.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా 15 వికెట్ల పడగొట్టి టీమిండియా విక్టరీలో కీరోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.
ఇక మహిళల జట్టులో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా స్మృతి మంధాన ఎంపిక అయింది. ఒక దేశం నుంచి ఒకే నెలలో పురుషులు, మహిళలు అవార్డులను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన 3 వన్డేల్లో ఆమె 113,136,90 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన మైయా బౌచియర్, శ్రీలంకకు చెందిన విష్మి గుణరత్నేలను ఓడించిన, లేడీ విరాట్ అంతర్జాతీయ కెరీర్‌లో మొదటిసారి ఈ అవార్డును దక్కించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com