T20 World Cup 2024 : చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా

టీ20వరల్డ్ కప్ లోబంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత 20 ఓవర్లలో 113/6 స్కోరు మాత్రమే చేసిన ప్రొటీస్ టీమ్.. తర్వాత బంగ్లాదేశ్‌ను 109/7 స్కోరుకే కట్టడి చేసింది. చివరి ఓవర్‌లో బంగ్లా 11 రన్స్ చేయాల్సి ఉండగా, స్పిన్నర్ మహరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అపురూప విజయాన్ని అందించారు.
టీ20వరల్డ్ కప్ లో అత్యల్ప స్కోరు(114)ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. నిన్న బంగ్లాపై గెలుపుతో ఈ ఘనత సాధ్యమైంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక-120(vsకివీస్), ఇండియా-120(vsపాక్), అఫ్గాన్-124(vsవిండీస్), న్యూజిలాండ్-127(vs ఇండియా) ఉన్నాయి. అలాగే పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాపై వరుసగా అత్యధిక మ్యాచ్‌లు(9) గెలిచిన రెండో జట్టుగా ప్రొటీస్ నిలిచింది. కివీస్ 10 గెలుపులతో తొలిస్థానంలో ఉంది.
టీ20వరల్డ్ కప్ లోథ్రిల్లింగ్ విక్టరీలు సాధించడం సౌతాఫ్రికాకు పరిపాటిగా మారింది. 5 పరుగుల కంటే తక్కువ మార్జిన్లతో ఆ జట్టు నాలుగుసార్లు గెలిచింది. 2009లో న్యూజిలాండ్‌పై ఒక రన్, 2014లో అదే జట్టుపై 2, అదే ఏడాది ఇంగ్లండ్‌పై 3, ఈసారి బంగ్లాదేశ్‌పై 4 పరుగుల తేడాతో ప్రొటీస్ విజయం సాధించింది. మరే ఇతర జట్టుకూ ఈ ఘనత సాధ్యం కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com