SRH vs LSG Match Update : వర్షం పడే ఛాన్స్ తక్కువ.. ఎస్ ఆర్ హెచ్ ఎల్ ఎస్ జి మ్యాచ్ అప్డేట్ ఇదే

SRH vs LSG Match Update  : వర్షం పడే ఛాన్స్ తక్కువ.. ఎస్ ఆర్ హెచ్ ఎల్ ఎస్ జి మ్యాచ్ అప్డేట్ ఇదే

ఇవాళ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్-లక్నో మధ్య జరిగే మ్యాచుకు వర్షం అంతరాయం కల్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షం పడే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని, స్వల్ప అంతరాయం తప్ప మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశమే లేదని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తడిసి ముద్దయింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. రెండు జట్లు కూడా ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి రేస్ లో ఉన్నాయి.

పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న డీఆర్ఎఫ్ సిబ్బందిని అధికారులు అలర్ట్ చేశారు. వర్షం పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్. రోడ్లపై నిలిచిపోయిన నీటిని, విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫోన్లను క్షేత్రస్థాయి సిబ్బందికి వెంటనే తెలియజేయాలని చెప్పారు. సిటిజన్స్ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే కాల్ సెంటర్ కి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags

Next Story