SRH : చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 146* సిక్సర్లు నమోదు చేసింది. 12 మ్యాచ్‌లలోనే SRH ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 145 (2018) రికార్డును బద్దలుకొట్టింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 143 (2019), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 142 (2016), ముంబై ఇండియన్స్ 140 (2023) ఉన్నాయి.
లక్నోతో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు హెడ్(89*), అభిషేక్(75*) LSG బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదారు. ఈ విజయంతో SRH ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి.
హైదరాబాద్ బ్యాటింగ్ చూశాక తనకు మాటలు రావట్లేదని లక్నో కెప్టెన్ రాహుల్ తెలిపారు. ‘ఇలాంటి బ్యాటింగ్‌ని మేం టీవీలో చూశాం. కానీ ఇది నమ్మశక్యంగా లేదు. హెడ్, అభిషేక్ అలవోకగా సిక్సులు కొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. బదోనీ, పూరన్ బాగా బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో 240 రన్స్ చేసినా వారు ఛేదించేవారు’ అని రాహుల్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com