T20 Records : టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డ్

T20 Records : టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డ్

ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు సాధించారు. టీ20ల్లో 6 సెంచరీలు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా ఆయన నిలిచారు. హైదరాబాద్ తో మ్యాచ్‌లో సూర్యకుమార్ ఈ ఘనత సాధించారు. అగ్ర స్థానంలో విరాట్ కోహ్లీ (9 సెంచరీలు) ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (8), రుతురాజ్ గైక్వాడ్ (6), కేఎల్ రాహుల్ (6) కొనసాగుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. 169 పరుగుల టార్గెట్‌ను ఆ జట్టు 17.2 ఓవర్లలో చేధించింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ (102*) సెంచరీతో చెలరేగారు. అతడికి తిలక్ వర్మ (37*) సహకారం అందించారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, కమిన్స్, జాన్సెన్ తలో వికెట్ తీశారు.

Tags

Next Story