T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్

టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ ఫేవరెట్స్ లో ఒక టీమ్ న్యూజీలాండ్. అలాంటి టీమ్ కు షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టు టోర్నమెంట్ నుండి ఔట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ (AFG) ఏడు వికెట్ల తేడాతో పపువా న్యూ గినియా (PNG) జట్టుపై విజయం సాధించడంతో న్యూజిలాండ్ (NZ)ని టోర్నీ నుండి బయటకు వెళ్లక తప్పలేదు. మొదట బౌలింగ్ ఎంచుకున్న తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 95 పరుగులకే PNG ని కట్టడి చేసింది.

అనంతరం ఆఫ్ఘనిస్థాన్ జట్టు 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా, టోర్నమెంట్‌లో న్యూజిలాండ్‌ కు ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్ లలో మూడు గెలిచి సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజీలాండ్.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో 84 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. గ్రూప్ సి నుండి ఆఫ్ఘనిస్థాన్, విండీస్ జట్లు సూపర్ 8కు అర్హత సాధించాయి. కివీస్, ఉగాండా, పపువా న్యూ గినియా జట్లు ఔట్ అయ్యాయి.

Tags

Next Story