T20 World Cup : వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం

టి20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. వికెట్ కీపర్ జేన్ గ్రీన్ ఒక్కడే మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. సమన్వయంతో ఆడిన గ్రీన్ ఐదు ఫోర్లతో 38 పరుగులు సాధించాడు. మలాన్ క్రుగర్ (18), కెప్టెన్ గెర్హాడ్ (15) పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఆడమ్ జంపా మూడు, హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 10 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. డేవిడ్ వార్నర్ 21 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఆరు ఫోర్లతో అజేయంగా 54 పరుగులు చేశాడు. కెప్టెన్ మిఛెల్ మార్ష్ (18), టిమ్ డేవిడ్ (23), మాథ్యూ వేడ్ 12 (నాటౌట్) జట్టును తమవంతు సహకారం అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com