T20 World Cup : జట్టును ప్రకటించిన పాకిస్థాన్

T20 World Cup : జట్టును ప్రకటించిన పాకిస్థాన్
X

అమెరికా, వెస్టిండీస్‌లు వేదికలుగా జూన్ 2 నుంచి జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌ వరల్డ్ కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టు కెప్టెన్సీ బాధ్యతలు బాబర్ ఆజంకు అప్పగించింది.

ఇక, అబ్రార్ అహ్మద్, అజామ్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ లు తొలిసారి టీ20 వరల్డ్ కప్ బరిలో దిగే అవకాశం లభిస్తోంది. అయితే, సీనియర్ బౌలర్ హసన్ అలీకి పాక్ జట్టులో స్థానం దక్కలేదు.

20 జట్లు తలపడుతున్న పొట్టి ప్రపంచకప్‌లో 19 దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించగా.. ఆఖరి దేశం పాకిస్తాన్.

పాకిస్థాన్ జట్టు : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫఖార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, అజామ్ ఖాన్, షాదాబ్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, ఇమాద్ వసీం, నసీమ్ షా, మహ్మద్ ఆమిర్, సయీమ్ అయూబ్, హరీస్ రవూఫ్, షహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.

Tags

Next Story