Gautam Gambir : టీమ్ ఇండియా కోచ్ గంభీర్ జీతం ఎంతంటే?

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో గౌతీ జీతంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ద్రవిడ్‌కు ఇచ్చిన వేతనం కంటే రెట్టింపు గంభీర్ పొందనున్నారని టాక్. ద్రవిడ్‌కు రూ.12 కోట్లు ఇవ్వగా ఆయనకు రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. KKR మెంటార్‌గా కూడా ఆయన రూ.25 కోట్లు అందుకున్నట్లు సమాచారం. డైలీ వేజ్, ఫ్లైట్ ఛార్జీలు, బస ఖర్చులనూ బీసీసీఐ భరించనుంది.
ఐపీఎల్ టోర్నీలో గౌతమ్ గంభీర్ ప్రాతినిథ్యం వహించడానికి ఇకపై కుదరదు. కేకేఆర్ మెంటార్ పదవికి కూడా అతడు గుడ్ బై చెప్పేశాడు. ఈ లెక్కలన్నీ ఆలోచించి.. బీసీసీఐని గంభీర్ భారీగా జీతాన్ని డిమాండ్ చేశాడట. అందుకే రాహుల్ ద్రవిడ్ కంటే ఎక్కువగానే గౌతీ అందుకోనున్నాడు. సహాయ సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛను తనకే వదిలేయాలని కూడా గంభీర్ డిమాండ్ పెట్టాడట. దీనికి కూడా బీసీసీఐ ఒకే చెప్పిందని తెలుస్తోంది. అసిస్టెంట్ కోచ్‌గా ముంబై మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్‌ను ఎంపిక చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com