Cricket : పెర్త్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ

భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ ల బోర్డర్ గవాస్కర్ లో భాగంగా పెర్త్ లో జరిగిన ఫస్ట్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ తేడాతో కంగారు జట్టును మట్టికరిపించింది. దీంతో నాలుగోరోజే ఆట ముగిసింది. దీంతో సిరీస్ లో టీమిండియా 10 లీడ్ సాధిచింది. మొదట టాస్ గెలిచిన భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 150 రన్స్ కే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 487 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా కేవలం 238 పరుగులే చేయగలిగింది. బౌలింగ్ తో రాణించిన కెప్టెన్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 3, సిరాజ్ 3, వాషింగ్టన్ సుందర్ 2.. నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా చెరో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఆసీస్ గడ్డపై భారత్‌కిదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com