Ind vs Eng : రాజ్ కోట్ లో గెలుపు ... చరిత్ర సృష్టించిన టీమిండియా

రాజ్ కోట్ (Rajkot) వేదికగా ఇంగ్లండ్ తో (England) జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. టెస్టుల పరంగా టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం. గతంలో న్యూజిలాండ్‌పై 372, సౌత్‌ఆఫ్రికాపై 337, న్యూజిలాండ్‌పై 321, ఆస్ట్రేలియాపై 320 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇవన్నీ టీమిండియా సొంత గడ్డపైనే గెలవడం విశేషం. కాగా ఇంగ్లండ్ కు ఇది రెండో ఘోర ఓటమి.. 1934లో ఆసీస్ చేతిలో 562 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇంగ్లండ్.
టీమిండియా అతిపెద్ద విజయాలు..
ఇక టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాలు చూస్తే..
– 434 ఇంగ్లండ్ పై (రాజ్‌కోట్ వేదికగా 2024లో..)
– 372 న్యూజిలాండ్‌పై(ముంబై 2021లో..)
– 337 సౌత్‌ఆఫ్రికాపై(ఢిల్లీ 2015లో..)
– 321 న్యూజిలాండ్‌పై(2016లో..)
– 320 ఆస్ట్రేలియాపై (మొహాలి 2008లో)
ఇక టీమిండియా ఇన్నింగ్ విజయాలు..
ఇక భారత క్రికెట్ జట్టు గతంలో సాధించిన ఇన్నింగ్స్ విజయాలు పరిశీలిస్తే..
– వెస్టిండీస్‌పై (272 పరుగులతో 2018లో, రాజ్‌కోట్)
– ఆఫ్ఘనిస్తాన్‌పై 262 పరుగులతో 2018లో, బెంగళూరు)
– బంగ్లాదేశ్‌పై(239 పరుగులతో 2007లో, మీర్‌పూర్)
– శ్రీలంకపై (239 పరుగులతో 2007లో, నాగపనూర్)
– శ్రీలంకపై (222 పరుగులతో 2022లో మొహాలీ)
రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించడంతో భారత్ (India) ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో తిరిగి రెండో స్థానానికి ఎగబాకింది. గతవారం దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టెస్టులు నెగ్గిన న్యూజిలాండ్ 75 శాతంతో అగ్రస్థానానికి చేరుకోగా, అప్పటిదాకా టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి, రెండులో ఉన్న భారత్ మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించడంతో రోహిత్ సేన రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com