TeamIndia Players with PM Modi : ప్రధాని మోడీతో టీమిండియా ఆటగాళ్ల భేటీ.. వీడియోలు వైరల్

టీ20 ప్రపంచకప్ గెలిచి బార్బడోస్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టు గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మొత్తం 15 మంది ఆటగాళ్లు ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలిశారు.
ప్లేయర్లు,టీమ్ ను అల్పాహార విందుకు ఆహ్వానించింది పీఎంఓ. ప్రధాని మోదీ ప్రపంచ కప్ ట్రోఫీని కూడా తన చేతుల్లోకి తీసుకున్నారు. రోహిత్, ద్రావిడ్ చేతుల్లోనే దాన్ని పెట్టి.. వారి చేతులు పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు ప్రధాని.
ప్రధాని మోదీని కలిసిన తర్వాత బృందం ముంబైకి వెళ్లింది. టీమిండియా నారిమన్ పాయింట్ నుండి వాంఖడే వరకు రోడ్ షో ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఇచ్చారు. వాంఖడే స్టేడియంలో జట్టును సన్మానించనున్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టుపై బీసీసీఐ రూ. 125 కోట్ల రివార్డును ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com