TeamIndia : స్వదేశానికి వచ్చిన టీమిండియా.. అభిమానులు గ్రాండ్ వెల్కమ్
టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టు ఎట్టకెలకు స్వదేశానికి చేరుకుంది. 2024 జులై 04 వ తేదీ గురువారం ఉదయం స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమిండియా జట్టు్కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రోహిత్ టీమ్ ప్రధాని మోదీతో సమావేశం కానుంది. ఈ కార్యక్రమంలో జట్టును అభినందించనున్న మోదీ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలోనే ముంబయికి బయల్దేరుతుంది. అక్కడ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రోడ్ షో మొదలవుతుంది. రాత్రి వాంఖడె స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం జరగనుంది. టోర్నీ శనివారమే ముగిసినా ఫైనల్ జరిగిన బార్బడోస్‌లో తుపాను వల్ల భారత జట్టు రావడం ఆలస్యమైంది.
టీమిండియా షెడ్యూల్
ఉదయం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్
ఉదయం 9 గంటలకు ప్రధాన మంత్రి మోదీ ఇంటికి
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం12 గంటల దాకా మోదీతో సమావేశం
మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి ప్రయాణం
సాయంత్రం 4 గంటలకు ముంబైకి రాక
సాయంత్రం 5 నుంచి ముంబై నారీమన్ పాయింట్ నుంచి విక్టరీ పరేడ్ మొదలు
రాత్రి 7- 7.30 గంటల మధ్య వాంఖడే స్టేడియంలో బీసీసీఐ సత్కారం, రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ అందజేత
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com