Cool Drinks : కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారా.. ఇది చూసుకోండి

Cool Drinks : కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారా.. ఇది చూసుకోండి

సమ్మర్ లో దాహం తీర్చుకోవడానికి ప్రజలు ఫస్ట్ కొనుక్కునేది కూల్ డ్రింక్. కానీ.. అది చాలా డేంజర్ అంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. చిన్నపిల్లలైనా, ముసలివారైనా, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటారు. ఎక్కువగా తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుసుకోండి.

శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల శరీర భాగాలు దెబ్బతింటాయి. ఇందులో ఉండే కృత్రిమ చక్కెర, కేలరీలు ఊబకాయాన్ని ప్రేరేపిస్తాయి. ఇది మాత్రమే కాదు దీని కారణంగా మీరు మధుమేహంతో సహా అనేక ఇతర తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాలేయంలో ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి.

అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం కూల్ డ్రింక్స్ లో ఉంటుంది. ఇది మెదడుకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. కూల్ డ్రింక్స్ లో ఉండే ఫ్రక్టోజ్ పొట్ట చుట్టూ కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. గుండె, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. రక్తంలో మీ షుగర్ లెవెల్స్ ను కూడా కూల్ డ్రింక్స్ పెంచేస్తాయి. కాబట్టి.. వీలునుబట్టి తగ్గించండి.

Tags

Read MoreRead Less
Next Story