IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..చరిత్ర సృష్టించిన జడేజా

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించారు. టోర్నీ హిస్టరీలో 1000 పరుగులు చేసి, 100 వికెట్లు తీయడంతోపాటు 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా నిలిచారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకోవడం ద్వారా ఐపీఎల్‌లో క్యాచ్‌ల శతకం పూర్తి చేసుకున్నారు. అలాగే అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన సీఎస్కే ప్లేయర్‌గానూ నిలిచారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే నిన్న చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే సునాయాస విజయం సాధించింది. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీతో(67* రన్స్) రాణించారు. దూబే 18 బంతుల్లో 28 రన్స్‌తో మెరుపులు మెరిపించారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు, నరైన్ ఒక వికెట్ తీశారు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇదే తొలి ఓటమి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com