T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో నేడు 3 మ్యాచ్‌లు

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో నేడు 3 మ్యాచ్‌లు
X

టీ20 వరల్డ్ కప్‌లో ఈరోజు మూడు మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులను అలరించనున్నాయి. ఇప్పటికే పపువా న్యూగినియా, ఉగాండా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఉ.6గంటలకు ఆస్ట్రేలియా, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రా.9గంటలకు పాకిస్థాన్‌ను అమెరికా ఢీకొంటుంది. దీంతో పాటు రా.12.30గంటలకు నమీబియా, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

కాగా, ఐర్లాండ్ ను చిత్తు చేసింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్‌2024లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో ఛేదించింది. టీమ్‌ ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 52, పంత్ 36* రన్స్‌తో రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచును ఈనెల 9న పాకిస్థాన్‌తో ఆడనుంది.

విరాట్ కోహ్లీ రికార్డు

ట్విటర్(X)లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్ల లిస్టులో టీమ్‌ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(63.5M) రెండో స్థానానికి చేరారు. తొలి స్థానంలో ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో (111.4M) కొనసాగుతున్నారు. కోహ్లీ తర్వాతి స్థానాల్లో వరుసగా నెయ్‌మర్.Jr (63.4M), బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్(52.8M), సచిన్ టెండూల్కర్ (40M) ఉన్నారు.

Tags

Next Story