Travis Head Love Story : ట్రావిస్ హెడ్ లవ్ స్టోరీ తెలుసా.. పెళ్లి కాకుండానే తండ్రయ్యాడు
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అటగాడు.. ట్రావిస్ హెడ్. అద్భుతంగా రాణిస్తున్న ఆస్ట్రేలియా జట్టు స్టార్ బ్యాటర్ అతను. మోడల్ జెస్సికా డేబిన్, ట్రావిస్ హెడ్ లవ్ స్టోరీ వింటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ట్రావిస్, జెస్సికా 2021లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 2022లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. వాళ్లిద్దరు పెళ్లికాక ముందే బిడ్డకు జన్మనిచ్చారు. పేరెంట్స్ అయ్యాక 2023లో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని జెస్సికా ఇన్ స్టాలో షేర్ చేసింది.
మే 2022లో జరిగిన విమాన ప్రమాదం నుంచి ట్రావిస్ హెడ్, జెస్సికా తృటిలో తప్పించుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరు హాలిడే ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లారు. ఆ టైంలో జెస్సికా గర్భవతి. టేకాఫ్ అయిన అరగంట తర్వాత విమానం ఓ ద్వీపంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందనీ.. సినిమాలాగా జరిగిందని చెప్పింది జెస్సికా. వీరిద్దరి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com