Hardik Pandya : హార్దిక్ భార్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్

ముంబై కెప్టెన్‌గా (Mumbai Indians) రోహిత్‌ను (Rohit) కాదని హార్దిక్‌కు (Hardik Pandya) బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొందరు పాండ్య భార్యను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. నటాషా సోషల్ మీడియా పోస్టులపై పాండ్యను ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా కుటుంబ సభ్యులను విమర్శించడం సరికాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ 278 రికార్డు స్కోర్ నమోదు చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని సన్ రైజర్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో బౌలర్లు ఎక్కువ పరుగులు ఇవ్వడంపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు. బ్యాటర్లకు పిచ్ పూర్తి అనుకూలంగా ఉందని తెలిపాడు.
ముంబై బౌలర్ల ఆటతీరుపై తమకు ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశాడు. తమ వద్ద యంగ్ బౌలర్లు ఉన్నారని.. వారు నేర్చుకునేందుకు కాస్త సమయం అవసరమని అభిప్రాయపడ్డాడు. డని తెలిపాడు. ఇక నిన్నటి మ్యాచ్ లో హైదరాబాద్ బ్యా ముంబై టీంలోని ప్రతి బ్యాటర్ మంచి ఫామ్లోనే ఉన్నా టర్లు బాగా ఆడారని పాండ్య కొనియాడాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com