U19 Women's T20 World Cup : నేటి నుంచి U19 మహిళల టీ20 వరల్డ్ కప్

U19 Womens T20 World Cup  : నేటి నుంచి U19 మహిళల టీ20 వరల్డ్ కప్
X

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్ గ్రూప్-ఏలో ఉన్నాయి. టీమ్ ఇండియా తన తొలి మ్యాచును రేపు వెస్ట్ ఇండిస్ తో ఆడనుంది. నేడు తొలి మ్యాచు ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో చూడవచ్చు. 2023లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే, మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ‘సూపర్‌ సిక్స్‌’కు చేరుకోనున్నాయి. ఈ 12 టీమ్స్ ను సూపర్‌ సిక్స్‌లో రెండు గ్రూప్‌లుగా చేస్తారు. గ్రూప్‌–1లో 6, గ్రూప్‌–2లో మరో ఆరు జట్లు ఉండనున్నాయి. ఈ సూపర్‌ సిక్స్‌’ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత గ్రూప్‌–1, గ్రూప్‌–2లలో తొలి రెండు స్థానాల్లో ఉన్న నాలుగు టీమ్స్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. సెమీస్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ కు తలపడనున్నాయి.

Tags

Next Story