Uganda Player : ఉగాండా ప్లేయర్ ఫ్రాంక్ సుబుగా అరుదైన రికార్డు

Uganda Player : ఉగాండా ప్లేయర్ ఫ్రాంక్ సుబుగా అరుదైన రికార్డు
X

ఉగాండా ప్లేయర్ ఫ్రాంక్ సుబుగా అరుదైన రికార్డు నెలకొల్పారు. అతి పెద్ద వయసు(43 ఏళ్లు)లో టీ20 ప్రపంచకప్ ఆడనున్న ఆటగాడిగా నిలిచారు. ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఆయన చోటు దక్కించుకున్నారు. కాగా, ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ రీజనల్‌లో ఫైనల్‌లో ఉగాండా రెండో స్థానంలో నిలిచింది. తద్వారా వరల్డ్ కప్​కు అర్హత సాధించింది. గ్రూప్-సిలో ఉన్న ఉగాండా, తొలి మ్యాచులో జూన్ 3న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.

ఉగాండా జట్టు - బ్రయాన్‌ మసాబా, కెన్నెత్‌ వైస్వా, రిజాత్‌ అలీ షా, ఫ్రాంక్‌ సుబుగా, దినేశ్‌ నక్రాని, రోజర్‌ ముకాసా, రోనక్‌ పటేల్‌, బిలాల్‌ హసున్‌, కోస్మాస్‌ క్యెవుటా, రాబిన్సన్‌ ఒబుయా, ఫ్రెడ్‌ అచెలమ్‌, హెన్నీ సెన్యోండో, సిమోన్‌ సెసాజి, జుమా మియాజి. అల్పేష్‌ రాజ్‌మణి.

ఇక స్కాట్లాండ్ కూడా 15 మంది సభ్యులతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు రిచీ బెరింగ్టన్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

స్కాట్లాండ్‌ జట్టు - రిచీ బెరింగ్టన్ (కెప్టెన్‌), బ్రాడ్ క్యూరీ, మాథ్యూ క్రాస్, ఒలి హెయిర్స్, క్రిస్ గ్రీవ్స్, మైఖేల్ జోన్స్, జాక్ జార్విస్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, మైఖేల్ లీస్క్, క్రిస్ సోల్, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్, చార్లీ టియర్.

Tags

Next Story