Varun Aaron : రెడ్‌బాల్ క్రికెట్‌కు వరుణ్ ఆరోన్ గుడ్ బై

టీమ్ఇండియా బౌలర్ వరుణ్ ఆరోన్ (Varun Aaron) రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. '2008 నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నా. ఈ జర్నీలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. గాయాలతో బాధపడ్డా. వయసు రీత్యా ప్రస్తుతం నా శరీరం ఈ ఫార్మాట్‌కు సహకరించదని గ్రహించా. అందుకే వీడ్కోలు పలుకుతున్నా. వైట్‌బాల్ క్రికెట్‌లో కొనసాగుతా' అని ఆరోన్ చెప్పాడు.
వరుణ్ అరోన్ 2008లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. మొత్తంగా 65 మ్యాచుల్లో 33.74 ఎకానమీతో 168 వికెట్లు పడగొట్టాడు. అతడు ఆరుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 2011 నవంబర్‌లో అరోన్ భారత్ తరఫునతొలి టెస్టు ఆడాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్(ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్), రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
రిటైర్మెంట్ అనంతరం అరోన్ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో భాగం కానున్నాడు. అక్కడ యువ ఫాస్ట్ బౌలర్లకు తర్ఫీదు ఇవ్వనున్నాడు. ‘ఎంఆర్ఎఫ్ వాళ్ల ‘పేస్ బౌలర్ టాలెంట్ హంట్' ప్రాజెక్టులో సభ్యుడిని. దేశవ్యాప్తంగా ఉన్న యువ పేసర్లతో కలిసి పనిచేయనున్నా. ఈ ప్రాజెక్ట్‌లో దాదాపు 1,500 మంది భాగమయ్యారు. తర్వాతి ప్రాజెక్టలో భాగంగా దేశమంతా తిరిగి 20 మంఇ పేసర్లను ఎంపిక చేయనున్నాం’ అని అరోన్ వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com