Prabhas Upcoming Film : ప్రభాస్ సినిమాలో విలన్‌గా వరుణ్ తేజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరలవుతోంది. ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ రెడీ చేశారని, వరుణ్‌కు తన క్యారెక్టర్ గురించి వివరించారని అంటున్నారు. స్పిరిట్ చిత్రంలో హీరో పాత్రకు ధీటుగా వరుణ్ పాత్ర కూడా ఉండనుందని టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాలోని హీరోయిన్ గురించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో స్పిరిట్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్ . ఇక ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com