Virushka : మరో బిడ్డకు తల్లిదండ్రులైన విరుష్క జంట

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్శ (Anushka Sharma) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారు మరోసారి తల్లిదండ్రులైనట్టు ప్రకటించారు. తాజాగా తాము రెండో బిడ్డకు స్వాగతం పలికారు. ఫిబ్రవరి 15న మగబిడ్డను స్వాగతించినట్లు ఈ జంట వెల్లడించారు. అనుష్క, విరాట్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో తమకు మగబిడ్డ పుట్టాడని ఓ పోస్ట్ షేర్ చేశారు. తమకు పుట్టిన అబ్బాయికి అకాయ్ అని పేరు పెట్టినట్లు కూడా తెలిపారు. అయితే పుట్టిన బిడ్డ ఫోటో మాత్రం షేర్ చేయలేదు. దానికి బదులు ఓ గ్రీటింగ్ కార్డ్ ని షేర్ చేశారు.
“సమృద్ధమైన ఆనందంతో, మా హృదయాల నిండు ప్రేమతో, ఫిబ్రవరి 15న, మా అబ్బాయి అకాయ్, వామికా తమ్ముడిని మేము ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అందరికీ తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము అని పోస్ట్ చేసిన కార్డ్ పై ఉంది. మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మేము మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. ఈ సమయంలో దయచేసి మా ప్రైవసీని గౌరవించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము” అని పోస్ట్ పెట్టారు.
అనుష్క, విరాట్ దంపతులకు మగబిడ్డ పుట్టాడని తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెటిజన్లు కూడా తమ ఫేవరేట్ కపుల్ కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com