Virat Kohli Trolls : 43 బంతుల్లో ఆడి 51 రన్స్ .. విరాట్ కోహ్లీపై ట్రోల్స్

విరాట్ కోహ్లీపై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. నిన్న సన్ రైజర్స్ పై స్లో ఇన్నింగ్స్ ఆడారని, 43 బంతులు ఆడి 51 రన్సే చేశారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పవర్ ప్లే తర్వాత 25 బంతులాడి 19 రన్స్ చేశారని, స్ట్రైక్ రేట్ 118 మాత్రమే ఉందంటున్నారు. ఈ సీజన్లో మిడిల్ ఓవర్లలో విరాట్ స్ట్రైక్ రేటు 123గా ఉందని, వేగంగా పరుగులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. కోహ్లీ.. 2011(557 రన్స్), 2013(634), 2015(505), 2016(973), 2018(530), 2019(464), 2020(466), 2021(405), 2023(639) సీజన్లతో పాటు 2024లోనూ ఈ ఫీట్ సాధించారు. ఓపెనర్‌గానూ 4000 పరుగుల మైలురాయి అందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com