IPL 2024 : సన్‌రైజర్స్ కు చెపాక్ భయం.. గెలుస్తుందా లేదా?
ఐపీఎల్ లో భాగంగా ఇవాళ కీలక పోరు జరగనుంది. ఫైనల్‌కు అర్హత సాధించేందుకు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అయితే క్వాలిఫయర్-2 జరిగే చెన్నై చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ కు చెత్త రికార్డు ఉంది. అక్కడ సన్‌రైజర్స్ 10 మ్యాచులు ఆడగా ఎనిమిదింటిలో ఓడింది. ఒక మ్యాచ్ గెలవగా, మరో మ్యాచ్ టై అయింది. మరి ఈ సెంటిమెంట్‌ను కమిన్స్ సేన బ్రేక్ చేసి, విజయం సాధిస్తుందేమో చూడాలి.
క్వాలిఫయర్2లో సన్‌రైజర్స్ భవితవ్యం పవర్ హిట్టింగ్ ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్(533 రన్స్), అభిషేక్(470 రన్స్)పైనే ఆధారపడి ఉంది. బౌల్ట్, అశ్విన్, చాహల్ వంటి ప్రమాదకర బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోర్ చేయాలంటే ఈ జోడీ రాణించకతప్పదు. వీరితో పాటు క్లాసెన్(413) కూడా మరోసారి ఆపద్బాంధవుడిగా మారాలి. కెప్టెన్ కమిన్స్, భువీ, నట్టూలతో కూడిన బౌలింగ్ యూనిట్ ఎలాగూ మినిమం గ్యారంటీ పెర్ఫామెన్స్ ఇస్తుంది.
అయితే చెన్నైలో జరిగే క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలవడం సన్‌రైజర్స్‌కు కష్టమేనని అంబటి రాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తో పోలిస్తే రాజస్థాన్ బౌలర్లకు ఆ పిచ్ బాగా నప్పుతుందని పేర్కొన్నారు. ‘ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అదేమీ హైదరాబాద్ వికెట్ కాదు. సన్‌రైజర్స్ ఆటగాళ్లు మెదడు ఉపయోగించి ఆచితూచి ఆడాలి. అక్కడ వికెట్లు తీయలేరు కాబట్టి బ్యాటింగ్‌తోనే పైచేయి సాధించాలి’ అని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com