Cricket : రెండో టెస్టుకూ విలియమ్సన్‌ దూరం

Cricket : రెండో టెస్టుకూ విలియమ్సన్‌ దూరం
X

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి ప్రారంభంకానుంది. పుణె వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు గట్టి షాక్ తగిలింది. రెండో టెస్టు మ్యాచ్‌కూ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ అందుబాటులో ఉండట్లేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయంలో కేన్‌కు గజ్జల్లో గాయమైంది. దాని నుంచి కోలుకుంటాడని భావించి భారత్‌ సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ, జట్టుతో కలిసి అతడు భారత్‌కు రాలేదు. స్వదేశంలోనే చికిత్స పొందుతున్నాడు. పూర్తిగా రికవరీ కాకపోవడంతో తొలి టెస్టులోనూ ఆడలేదు.. ఇప్పుడు రెండో టెస్టుకూ దూరమయ్యాడు. ‘కేన్ విలియమ్సన్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. వేగంగా కోలుకుంటున్నాడు. ఇంకా వంద శాతం ఫిట్‌ సాధించలేదు. మూడో టెస్టుకు అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నాం’’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

Tags

Next Story