World Test Championship : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీ డబుల్ !

వరల్డ్ టెస్ట్ క్రికెట్ చాంపియన్ ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. 2023 2025 ఎడిషన్ కు మొత్తం 5.76 మిలియన్ డాల ర్లుగా ప్రకటించింది. ఇది గత ఎడిషన్ల కన్నా డబుల్ కావడం విశేషం. లండన్లోని లార్డ్స్ మైదానంలో జూన్ 11వ తేదీ నుంచి ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియ న్షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ నెగ్గిన జట్టుకు 3.6 మిలియన్ల డాలర్ల (రూ. 30.79 కోట్లు) ప్రైజ్ మనీ దక్కనుంది. ఇక ఫైనల్లో ఓడిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల (రూ. 17.96 కోట్లు) ప్రైజ్ మనీ అందుతుంది. 2023లో భారత జట్టుపై ఫైనల్లో గెలిచిన ఆస్ట్రే లియాకు 1.6 మిలియన్ల డాలర్ల (రూ.13.68 కోట్లు) ప్రైజ్మనీ దక్కింది. అలాగే రన్నరప్ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ.6.84 కోట్లు) ఇచ్చారు. టెస్టు క్రికెట్ ప్రాముఖ్యతను తె లియజెప్పేందుకే ప్రైజ్ మనీ పెంచినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత WTC టేబుల్ స్టాండింగ్స్:
1వ స్థానం: సౌతాఫ్రికా (69.44% పాయింట్లు)
2వ స్థానం: ఆస్ట్రేలియా (67.54% పాయింట్లు)
3వ స్థానం: ఇండియా (50.00% పాయింట్లు)
సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌లపై గెలుపులతో సౌతాఫ్రికా టాప్ ప్లేస్‌ను దక్కించుకోగా, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇండియా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com