Ind vs Eng : జైస్వాల్ మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీమ్ ఇండియా

రాజ్ కోట్ (Rajkot) వేదికగా ఇంగ్లండ్ (England) తో జరుగుతున్న మూడో టెస్టులో యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) మెరుపు శతకం సాధించారు. కేవలం 122 బంతుల్లోనే 9 ఫోర్లు 5 సిక్సర్లతో 100 రన్స్ చేశారు. హాఫ్ సెంచరీ వరకు నెమ్మదిగా ఆడిన ఈ యంగ్ ఓపెనర్ ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లపై మెరుపు దాడి చేశారు. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జెమ్స్ అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో 6, 4, 4 బాది ఒక్కసారిగా గేర్ మార్చేశాడు. కాగా జైశ్వాల్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. ఈ సిరీస్‌లో ఇది ముంబైకర్‌కు రెండో సెంచరీ కావడం గమనార్హం. రెండో టెస్టులోనూ అతడు డబుల్ సెంచరీ(209)తో అదరగొట్టారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 46 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 189 పరుగులు. జైస్వాల్ 104 పరుగులతో, శుభ్ మాన్ గిల్ 61 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 315 పరుగులకు పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 19 పరుగులు చేసి రూట్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com